KTR Memories: ప్రొఫెసర్‌ జయశంకర్‌తో జ్ఞాపకాలు.. ట్విటర్‌లో పంచుకున్న కేటీఆర్‌

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయనతో కలిసి ఉన్నటువంటి ఓ ఛాయా చిత్రాన్ని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్‌తో పాల్గొన్న ముఖ్య..

Published : 06 Aug 2022 14:24 IST

హైదరాబాద్‌: ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఓ ఫొటోను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్‌తో పాల్గొన్న ముఖ్య ఘట్టాలను కేటీఆర్ ట్విటర్‌లో తెలియజేశారు. ‘‘2009 నవంబర్ 29న కరీంనగర్‌ జిల్లా అల్గునూర్‌లో కేసీఆర్‌ను అరెస్ట్ చేసిన సమయంలో హనుమకొండలోని ప్రొఫెసర్ జయశంకర్ ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాం. ఆరోజు ప్రొఫెసర్ జయశంకర్‌ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. నన్ను వరంగల్ జైలుకు పంపించారు’’ అని నాటి రోజులను గుర్తుచేసుకుంటూ కేటీఆర్‌ రాసుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని