KTR: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపండి: కేంద్రానికి కేటీఆర్‌ బహిరంగ లేఖ

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలని భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన బహిరంగ లేఖ రాశారు.

Updated : 02 Apr 2023 12:33 IST

హైదరాబాద్: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలని భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఉక్కు పరిశ్రమలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. 

కార్పొరేట్లకు రూ.12.5లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ఎందుకు ఔదార్యం చూపడం లేదని ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఉత్పత్తులను కేంద్రం కొనుగోలు చేయడంతో పాటు వర్కింగ్‌ క్యాపిటల్‌కు ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. స్టీల్ ప్లాంట్‌కు రూ.5వేల కోట్లు కేటాయించాలని.. సెయిల్‌లో విలీనంపై పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని