KTR: వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే: కేటీఆర్‌

స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎన్ని ప్రతికూలతలు, కుట్రలు చేసినా రాష్ట్రాభివృద్ధి కోసం

Updated : 04 Jul 2022 12:31 IST

హైదరాబాద్‌: స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎన్ని ప్రతికూలతలు, కుట్రలు చేసినా రాష్ట్రాభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్ ట్యాంక్‌ బండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈసందర్భంగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. 

వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడేనన్న కేటీఆర్.. అల్లూరిని గుర్తు చేసుకోవడం ప్రతి భారత పౌరుడి విధి అని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన అల్లూరి జయంతి ఉత్సవాల్లో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌యాద్‌ సహా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని