KTR: అతి పెద్ద డిఫెన్స్‌ ఎకో సిస్టం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి: కేటీఆర్‌

అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయిల్, అనేక ఇతర దేశాలకు చెందిన ప్రముఖ డిఫెన్స్, ఏరోస్పేస్ కంపెనీలు ఒకేచోట భారీగా పెట్టుబడులు పెట్టిన నగరం ప్రపంచంలో హైదరాబాద్ మినహా ఇంకొకటి లేదంటే ఆశ్చర్యం లేదని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

Updated : 28 Nov 2022 21:42 IST

హైదరాబాద్: అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయిల్, అనేక ఇతర దేశాలకు చెందిన ప్రముఖ డిఫెన్స్, ఏరోస్పేస్ కంపెనీలు ఒకేచోట భారీగా పెట్టుబడులు పెట్టిన నగరం ప్రపంచంలో హైదరాబాద్ మినహా ఇంకొకటి లేదంటే ఆశ్చర్యం లేదని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దిల్లీలో జరిగిన డిఫెన్స్ కంపెనీల రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. సీఐఐ, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ కాన్ఫెడరేషన్ ఇండస్త్రీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో డిఫెన్స్ తయారీ రంగంలో ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను ప్రతినిధులకు కేటీఆర్ వివరించారు.

‘‘దేశంలో అతిపెద్ద డిఫెన్స్ ఎకో సిస్టం కలిగి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. గత ఏడేళ్ల కాలంలో భారీగా విస్తరించింది. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో స్థానికంగా సుమారు వెయ్యికి పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పనిచేస్తున్నాయి. తెలంగాణలోని డిఫెన్స్ పరిశోధన, అభివృద్ధి రంగం అత్యంత కీలకమైనది. హైదరాబాద్ నగరానికి మిసైల్‌ హబ్ ఆఫ్ ఇండియాగా పేరుంది. డీఆర్‌డీఓ, బీహెచ్‌ఈఎల్‌, హెచ్‌ఏఎల్‌ వంటి అనేక రక్షణ రంగ ప్రభుత్వరంగ సంస్థలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రపంచ దిగ్గజ ఏరోస్పేస్, డిఫెన్స్ సంస్థలు సైతం భారీగా పెట్టుబడులు పెట్టాయి. ప్రఖ్యాత డిఫెన్స్, ఏరోస్పేస్ సంస్థలైన లాక్ హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ, సాఫ్రాన్ వంటి అనేక కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాన్ని ప్రాధాన్యతా రంగంగా గుర్తించింది. భారీగా పెట్టుబడులు సాధించేందుకు అవసరమైన పాలనాపరమైన సంస్కరణలు అమలు చేస్తున్నాం. టీఎస్ ఐపాస్, హైదరాబాద్ నగరంలోని ప్రపంచస్థాయి మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, కోతల్లేని 24 గంటల పారిశ్రామిక విద్యుత్తు సదుపాయం వంటి అంశాలను పెట్టుబడి ప్రణాళికల్లో భాగంగా పరిగణనలోకి తీసుకోవాలని డిఫెన్స్ కంపెనీలకు ప్రభుత్వం తరఫున నా విజ్ఞప్తి’’ అని కేటీఆర్‌ అన్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు