Video: వారెవ్వా ఏమి డ్యాన్సు.. ఆ పిల్లల స్టెప్పులకు కేటీఆర్ ఫిదా
తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్(KTR) సామాజిక మధ్యమాల్లో ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. సమకాలీన అంశాలతో పాటు....
హైదరాబాద్: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్(KTR) సామాజిక మధ్యమాల్లో ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. సమకాలీన అంశాలతో పాటు ప్రజాసమస్యల పైనా ఆయన స్పందిస్తుంటారు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు తన పోస్టుల ద్వారా సెటైర్లు వేస్తూ చెక్‌పెట్టే కేటీఆర్.. అప్పుడప్పుడూ కొన్ని సరదా అంశాలనూ షేర్ చేస్తూ తన ఫాలోవర్లకు వినోదాన్ని పంచుతుంటారు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరలైన ఓ డ్యాన్స్ వీడియోకు కేటీఆర్ ఫిదా అయ్యారు. ‘‘ఈ వీడియో చూస్తే మీ ముఖాల్లో చిరునవ్వు విరబూస్తుంది. ఈ పిల్లలు అద్భుతమైన డ్యాన్సర్లు..’’ అని పేర్కొంటూ వీడియోను షేర్ చేశారు. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్స్టెప్పులతో ఉర్రూతలూగించిన ‘కాలా చష్మా’ విపరీతంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అనేకమంది ఈ సాంగ్‌కు తమదైన శైలిలో స్టెప్పులేస్తూ సామాజిక మాధ్యమాల్లో పంచుకొంటున్నారు. అయితే, ఈ సాంగ్‌కు కొందరు ఆఫ్రికన్ చిన్నారులు ఓ గ్రూపుగా ఏర్పడి వేసిన స్టెప్పులకు కేటీఆర్ ఫిదా అయిన ఆ వీడియో మీరూ చూసేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!