KTR: అంబేడ్కర్‌ లేకపోతే తెలంగాణ లేదు: మంత్రి కేటీఆర్‌

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆయన లేకపోతే తెలంగాణ లేదని వ్యాఖ్యానించారు.

Updated : 14 Apr 2023 13:07 IST

హైదరాబాద్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆయన లేకపోతే తెలంగాణ లేదని వ్యాఖ్యానించారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట కూడలిలో ఆయన విగ్రహాన్ని మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ‘‘అంబేడ్కర్‌ చెప్పిన విధంగా ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడుతూ ముందుకు సాగుతున్నాం. సీఎం కేసీఆర్‌ దమ్మున్న నేత. సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టడం ఆయనకే సాధ్యం. కేసీఆర్‌ తీసుకొచ్చిన దళితబంధు పథకం సాహసోపేతమైనది.  కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్‌ భవనానికి కూడా అంబేడ్కర్‌ పేరే పెట్టాలి. దేశంలోనే అతిపెద్దదైన ఆయన విగ్రహాన్ని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం గర్వకారణం. శతాబ్దాలపాటు దిశానిర్దేశం చేసేలా దాన్ని ఏర్పాటు చేశాం. స్థానికుల డిమాండ్‌ మేరకు పంజాగుట్ట కూడలికి అంబేడ్కర్‌ పేరు పెడతాం’’ అని కేటీఆర్‌ ప్రకటించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు