KTR: మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మరోసారి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయన

Updated : 30 Aug 2022 17:42 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ మరోసారి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. కొన్ని లక్షణాలు కనబడటంతో పరీక్షలు చేయించుకున్నానని..  కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్టు తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని, ముందుస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కేటీఆర్‌ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు పెడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని