KTR: ప్రజల కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ధరణి పోర్టల్‌: కేటీఆర్‌

శరవేగంగా పరుగులు పెడుతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఆధునిక సంస్కరణలే పునాదిరాళ్లు అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. టీఎస్‌ ఐపాస్‌ విధానంతో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమైందని కొనియాడారు.

Updated : 10 Jun 2023 12:24 IST

హైదరాబాద్‌: శరవేగంగా పరుగులు పెడుతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఆధునిక సంస్కరణలే పునాదిరాళ్లు అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. టీఎస్‌ ఐపాస్‌ విధానంతో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమైందని కొనియాడారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

‘‘భూమి చుట్టూ అల్లుకున్న సవాలక్ష చిక్కుముళ్లను విప్పేందుకు ప్రజల కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ధరణి పోర్టల్‌. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ నుంచి నూతన కలెక్టరేట్ల నిర్మాణం వరకు.. తండాలు, గ్రామ పంచాయతీల నుంచి నూతన రెవెన్యూ డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల వరకూ తెలంగాణలో తీసుకొచ్చిన ప్రతి సంస్కరణ భవిష్యత్ తరాలకు వెలకట్టలేనిది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు