Andhra News: రైతుకు దొరికిన వజ్రం.. ఎంతకు అమ్మాడో తెలుసా?

కర్నూలు జిల్లాలో ఓ రైతుకు అదృష్టం వరించింది. టమాటా పైరులో రైతు కుమార్తె కలుపు తీస్తుండగా వజ్రం దొరికొంది. వివరాల్లోకి వెళితే తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామానికి

Published : 10 Aug 2022 14:53 IST

తుగ్గలి: కర్నూలు జిల్లాలో ఓ రైతుకు అదృష్టం వరించింది. టమాటా పైరులో రైతు కుమార్తె కలుపు తీస్తుండగా వజ్రం దొరికొంది. వివరాల్లోకి వెళితే తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబం పొలంలో కలుపు పనుల్లో నిమగ్నమై ఉంది. ఈ క్రమంలో రైతు కుమార్తెకు 10 క్యారెట్ల బరువైన వజ్రం లభించింది. 

విషయం తెలుసుకున్న పెరవళి, జొన్నగిరి ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యాపారులు రైతును సంప్రదించారు. వ్యాపారులంతా కలిసి దాన్ని రూ.34లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఏటా తొలకరి వర్షాల తర్వాత జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, తుగ్గలి ప్రాంతాల్లోని పొలాల్లో వజ్రాలు లభించడం సాధారణమేనని స్థానికులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని