Andhra News: మున్సిపల్‌ సిబ్బంది అత్యుత్సాహం.. దుకాణంలో చెత్త పారబోత

కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చెత్త పన్ను కట్టలేదని ఓ దుకాణంలో సిబ్బంది చెత్త పారబోయడం

Updated : 29 Mar 2022 19:49 IST

కర్నూలు: కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చెత్త పన్ను కట్టలేదని ఓ దుకాణంలో సిబ్బంది చెత్త పారబోయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కర్నూలు కృష్ణానగర్‌లోని డెలివరీ సర్వీస్‌ షాప్‌లో ఈ ఘటన జరిగింది. చెత్త పోసిన అనంతరం దుకాణానికి మున్సిపల్‌ సిబ్బంది తాళం వేసి, సీజ్‌ చేసి వెళ్లిపోయారని బాధితులు చెబుతున్నారు. ఈ ఉదయం దుకాణం వద్దకు వచ్చిన సిబ్బంది చెత్త పన్నుతో పాటు ట్రేడ్‌ లైసెన్స్‌ గురించి అడిగారు. తమ హెడ్‌ ఆఫీస్‌ ఇక్కడ లేదని తమ యజమానులను అడగాలని సూచించారు. పన్ను విషయం తమ యజమానులతో మాట్లాడతామని చెబుతుండగానే చెత్త వేశారని బాధితులు వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని