TTD: తిరుమలలో ఆటోమేటిక్ యంత్రాలతో లడ్డూ తయారీ!
డిసెంబరు నాటికి తిరుమలలో లడ్డూ తయారీ యంత్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
తిరుమల: తిరుమలలో (Tirumala) లడ్డూ తయారీ కోసం డిసెంబరు నాటికి రూ.50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబరు నాటికి తిరుమల మ్యూజియాన్ని ప్రపంచంలోనే నంబర్ 1 స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జనవరి 28న తిరుమలలో నిర్వహించిన రథసప్తమి వేడుకులకు భక్తులు విశేషంగా తరలి వచ్చారన్నారు. నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయినట్లు చెప్పారు. లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించినట్లు తెలిపారు. తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న రధసప్తమి వేడుకలకు సంబంధించిన కానుకల లెక్కింపు చేపట్టనున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయ ఆనందనిలయం బంగారు తాపడం పనులను ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు చెప్పిన ఆయన.. త్వరలో మరో తేదీని నిర్ణయిస్తామని అన్నారు.
తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం జరుగుతోందని, తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనంద నిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్ టెండర్లకు వెళ్తున్నామని చెప్పారు.ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుండటంతో తాపడం పనులు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.భక్తులకు మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా ‘TTDevastanam’ పేరుతో మొబైల్ యాప్‌ను ప్రారంభించినట్లు చెప్పారు.
దీనిద్వారా శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ కోసం స్లాట్‌ను బుక్ చేసుకోవడంతోపాటు విరాళాలు కూడా అందించవచ్చని తెలిపారు. పుష్ నోటిఫికేషన్ల ద్వారా శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చని అన్నారు. ఎస్వీబీసీ ఛానెల్ ప్రసారాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించే సదుపాయం ఉంటుందని అన్నారు. గత నెలలో 20.78 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. హుండీ కానుకలు రూ.123.07 కోట్లు కాగా, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.1.07 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Sarus Crane: కొంగతో అనుబంధం.. కాపాడిన వ్యక్తిపై కేసు..!
-
Sports News
IPL 2023:చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం!
-
Movies News
SS Karthikeya: ‘RRR’ ఆస్కార్ క్యాంపెయిన్ ఖర్చు ఇదే.. విమర్శకులకు కార్తికేయ కౌంటర్!
-
Politics News
Madhyapradesh: 200కు పైగా సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారం మాదే..: నడ్డా
-
India News
Fact Check: ₹239 ఉచిత రీఛార్జ్ పేరుతో వాట్సాప్‌లో నకిలీ మెసేజ్!
-
Sports News
Dinesh Karthik: టీమ్ఇండియాలో అతడే కీలక ప్లేయర్.. కోహ్లీ, రోహిత్‌కు నో ఛాన్స్