‘విశాఖ ఉక్కును భిన్నంగా చూడాలి’

దేశంలో మిగిలిన కర్మాగారాలకు భిన్నంగా విశాఖ ఉక్కును చూడాలని విశ్రాంత ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. చిన్న చిన్న మార్పులతో విశాఖ ఉక్కును తిరిగి లాభాల్లోకి తీసుకు రావొచ్చని..

Published : 12 Mar 2021 12:38 IST

విశ్రాంత ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ

విశాఖపట్నం: దేశంలో మిగిలిన కర్మాగారాలకు భిన్నంగా విశాఖ ఉక్కును చూడాలని విశ్రాంత ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ అన్నారు. చిన్న చిన్న మార్పులతో విశాఖ ఉక్కును తిరిగి లాభాల్లోకి తీసుకు రావొచ్చని, ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదని సూచించారు. నిపుణుల సలహాలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్రానికి పంపనున్నట్టు లక్ష్మీనారాయణ తెలిపారు.

29వ రోజుకు చేరిన రిలే దీక్షలు..
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 29వ రోజుకు చేరాయి. తెదేపా నేత బండారు సత్యనారాయణ మూర్తి తదితరులు రిలే దీక్షలకు సంఘీ భావం తెలిపారు. సినీనటుడు శివాజీ దీక్షా శిబిరాన్ని సందర్శించి కార్మికులకు మద్దతు ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని