
Published : 25 Nov 2021 01:54 IST
Lalu Prasad Yadav: ఇప్పటికీ డ్రైవింగ్ సీట్‌లోనే ఉన్నానంటూ.. జీపు నడిపిన లాలూ..!
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డ్రైవర్‌గా మారారు. కార్యకర్తలతో కలిసి పట్నా వీధుల్లో జీపులో షికారు చేశారు. తనకు ఆరోగ్యం క్షీణించినా.. ఇప్పటికీ రాజకీయంగా తాను డ్రైవింగ్ సీట్‌లోనే ఉన్నాననే సందేశాన్ని కార్యకర్తలకు పంపారు. తన భార్య రబ్రీదేవి భవనం చుట్టుపక్కల ఉన్న వీధుల్లో ఓపెన్ టాప్ జీపును లాలూ నడిపారు. డ్రైవింగ్ చేస్తున్న లాలూను చూసి ఆశ్చర్యానికి గురైన ప్రజలు.. ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.
ఇవీ చదవండి
Advertisement
Tags :