YS Jagan: బెయిల్‌ ర‌ద్దు పిటిష‌న్‌పై విచార‌ణ‌

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ వైకాపా ఎంపీ

Updated : 17 May 2021 12:43 IST

హైద‌రాబాద్‌: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జ‌రిగింది. దీనిపై కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని న్యాయ‌స్థానం ఇది వ‌ర‌కే జ‌గ‌న్‌, సీబీఐను ఆదేశించింది.  ఈ నెల 7న విచార‌ణ‌ జ‌రిగిన స‌మ‌యంలో కౌంట‌ర్ దాఖ‌లుకు స‌మ‌యం కోరిన జ‌గ‌న్‌, సీబీఐ త‌ర‌ఫు న్యాయ‌వాదులు.. ఇవాళ కూడా మరోసారి గ‌డువు కోరారు. ఈ క్ర‌మంలో కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌డానికి చివ‌రి అవ‌కాశం ఇచ్చిన సీబీఐ కోర్టు.. విచార‌ణ‌ను ఈ నెల 26కి వాయిదా వేసింది. జగన్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన బెయిల్‌ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని కోరిన విష‌యం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని