Kiren Rijiju: ‘బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌’లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. వీడియో చూశారా?

కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్‌ వీడియోలను పోస్ట్‌ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారనే విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన మరోసారి ‘బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌’లో

Published : 06 Jul 2022 01:46 IST

దిల్లీ: కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్‌ వీడియోలను పోస్ట్‌ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారనే విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి ‘బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌’లో పాల్గొన్నారు. సంబంధిత వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా అది వైరల్‌గా మారింది. 

ఏంటీ బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్?

తైక్వాండో శిక్షకుడు‌, ఫైటర్‌ ఫరాబీ డావ్‌లెట్చిన్ (Farabi Davletchin) బాటిల్‌ని కింద పడగొట్టకుండా ఒకే కిక్‌తో దాని క్యాప్‌ను తెరిచే వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. దీంతో ఇది 2019లో సోషల్‌ మీడియా మొత్తంలో ‘బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌’ పేరిట బాగా ట్రెండ్‌ అయ్యింది. ప్రముఖులు ఈ ఛాలెంజ్‌ని స్వీకరించి తమ టాలెంట్‌ను ప్రదర్శించారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా తొలుత ఓ బాటిల్‌ను టేబుల్‌పై పెట్టి దానికి ఉన్న మూతను కాస్త వదులుగా ఉంచుతారు. బాటిల్‌ కిందపడకుండా దాని క్యాప్‌ను కాలితో తెరవాలి. అయితే, అప్పుడు కూడా ఈ ఛాలెంజ్‌ స్వీకరించిన కిరణ్‌ రిజిజు.. దాన్ని తెరిచి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. తాజాగా మరోసారి ఈ ఛాలెంజ్‌లో పాల్గొని బాటిల్‌ మూత తెరిచారు. కానీ, తేడా ఏంటంటే..? ఈసారి ప్లాస్టిక్‌ బాటిల్‌కు బదులు గాజు సీసాను వాడారు. ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. ‘ఫిట్‌నెస్‌ అనేది వన్‌ టైమ్‌ ఎఫర్ట్‌ కాదు.. లైఫ్‌ టైమ్‌ హాబిట్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి!




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని