ఆగస్టులో టీఎస్‌ లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలు

ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. మార్చి 24న నోటిఫికేషన్ జారీ చేసి.. మార్చి 26 నుంచి మే 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఆలస్య రుసుంతో జులై 20వ తేదీ వరకు

Published : 25 Feb 2021 01:27 IST

హైదరాబాద్‌: ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. మార్చి 24న నోటిఫికేషన్ జారీ చేసి.. మార్చి 26 నుంచి మే 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఆలస్య రుసుంతో జులై 20వ తేదీ వరకు దరఖాస్తులను చేసుకోవచ్చని ప్రకటించింది. జులై 20 నుంచి పరీక్ష హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ఏడాది కూడా లాసెట్, పీజీఎల్ సెట్ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా విశ్వవిద్యాలయం తీసుకుంది. కన్వీనర్‌గా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జీబీ రెడ్డి కొనసాగుతారని వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని