Chandrababu: అరెస్ట్‌ సమయానికి ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు: హరీశ్‌ సాల్వే వాదనలు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

Updated : 19 Sep 2023 20:21 IST

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో కీలక పాయింట్లను వివరించిన సాల్వే.. చంద్రబాబును అరెస్ట్‌ చేసే సమయానికి ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు లేదని చెప్పారు. ఈ సందర్భంగా స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ వర్సెస్‌ తేజ్‌మాల్‌ చౌదరి, అర్ణబ్‌ గోస్వామి కేసులను ప్రస్తావించారు.

‘‘ ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌పై గతంలో జరిగిన దర్యాప్తుపై మెమో మాత్రమే వేశారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 17ఏ కింద తగిన అనుమతులు తీసుకోలేదు. ఈ ఎఫ్‌ఐఆర్‌ చట్టవిరుద్ధమైనది. గతంలో వచ్చిన తీర్పులను అడ్వకేట్‌ జనరల్‌ తప్పుగా అన్వయించారు. సెక్షన్‌ 17ఏ పూర్తి వివరాలు తెలిసి ఉండీ తప్పనిసరి అనుమతులు తీసుకోలేదు. నేరం ఎప్పుడు జరిగిందన్నది కాదు.. దర్యాప్తు వేళ ఉన్న చట్టబద్ధత పరిగణించాలి. కేసు పెట్టేందుకు మూలమైన సమయం దృష్టిలో పెట్టుకొని సెక్షన్‌ 17ఎ వర్తిస్తుంది.’’ అని హరీశ్‌ సాల్వే కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత మరో సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా చంద్రబాబు తరఫున వాదనలు వినిపించారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు