MLC Ananthababu: అనంతబాబు కట్టుకథను అద్భుతంగా అల్లారు: న్యాయవాది శ్రావణ్ కుమార్
ప్రజా, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ ఉద్యమం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే పోలీసులు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో 302,
విజయవాడ: ప్రజా, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ ఉద్యమం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే పోలీసులు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య వ్యవహారంలో 302, ఎస్సీ, ఎస్టీ కింద కేసు నమోదు చేసి ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశారని జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఉద్యమం చేయకపోయి ఉంటే ఎమ్మెల్సీని అరెస్ట్ చేసేవాళ్లా అని ఆయన ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియాలో శ్రావణ్‌కుమార్ మాట్లాడారు.
‘‘నిన్న ఎస్పీ చెప్పిన స్టేట్మెంట్ను ప్రజలందరూ విన్నారు. సుబ్రహ్మణ్యం మరణానికి గాయాలు, విచక్షణారహితంగా ప్రైవేట్ భాగాల్లో కొట్టడమే కారమణమని పోస్టుమార్టం రిపోర్టు చెబుతుంటే.. చనిపోయిన తర్వాత కొట్టాడనే స్టేట్మెంట్ను పోలీసులు ఎలా ప్రామాణికంగా తీసుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు సహ నిందితులు లేకుండా హత్య కథను అద్భుతంగా అల్లారు. మాకున్న సమాచారం మేరకు ఈ దాడిలో ఏడు నుంచి ఎనిమిది మంది పాల్గొన్నారు.
నిందితులను కాపాడేందుకు అనంతబాబు స్కెచ్
అనంతబాబు అనుచరులందరూ సుబ్రహ్మణ్యాన్ని విచక్షణా రహితంగా కొట్టి, బీచ్‌లోని నీటిలో ముంచారు. లేకపోతే తన ఒళ్లు నిండా ఇసుక ఎందుకు ఉంది? నీళ్లు ఎందుకు ఉన్నాయి? అన్యాయంగా కొట్టి చంపేసి.. నిందితులను కాపాడటానికి అనంతబాబు స్కెచ్ వేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా, నిజాయతీగా ఈ కేసును విచారించాలని కోరుతున్నాం. ఎమ్మెల్సీ చెప్పిన కట్టుకథను పోలీసులు నమ్మొద్దు. దీనిపై హోంమంత్రి స్పందించి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే హోంమంత్రి రాజీనామా చేయాలి.
పోస్టుమార్టం రిపోర్టులో కొట్టాడని ఉంది తప్ప.. తోస్తే పడిపోయాడని లేదు. సుబ్రహ్మణ్యాన్ని కొట్టి చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులందర్నీ అరెస్టు చేయాలి. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మీద మాకు నమ్మకం లేదు. హైకోర్టు, ఎన్హెచ్ఆర్సీ, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో పిటిషన్ వేయబోతున్నాం. ఎమ్మెల్సీ ఒక్కడే కొట్టి చంపి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారంటే నమ్మాలా? ఇది కేసు నీరుగార్చే ప్రయత్నం తప్ప మరొకటి కాదు.
జగన్ చెప్పకపోతే అరెస్ట్ చేయరా?
సుబ్రహ్మణ్యాన్ని చంపి ఇంటి వద్ద మృతదేహాన్ని పడేసి విహార యాత్రలకు వెళ్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. ఓ దళిత బిడ్డను కొట్టి చంపేస్తే ఆ కుటుంబాన్ని హోంమంత్రి పరామర్శించరా? సీఎం జగన్ చెప్పారని నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎమ్మెల్సీని అరెస్టు చేసినట్లు మంత్రులు చెప్పుకోవడమేంటి? జగన్ చెప్పకపోతే అరెస్ట్ చేయరా? హత్య చేసిన వారిని అరెస్టు చేయడం పోలీసుల బాధ్యత కాదా?’’ అని శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్