Andhra News: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. సిబ్బంది ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా బదిలీలకు అవకాశం కల్పించాలని సీఎం

Published : 12 Aug 2022 17:07 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. సిబ్బంది ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా బదిలీలకు అవకాశం కల్పించాలని సీఎం జగన్‌ను కోరగా.. బదిలీలకు ముఖ్యమంత్రి అంగీకరించినట్టు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ ఛైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి తెలిపారు. బదిలీలపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎం చెప్పినట్టు ఆయన తెలిపారు. 

 దాదాపు 25 ఏళ్ళుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా ఒకేసారి పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు వై.బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి జీవీ నారాయణరెడ్డి తదితరులతో పాటు వెంకట్రామిరెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి సన్మానించి, ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించడంపై హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గతంలో ఒక టీచరు 8 సంవత్సరాలు ఒకేచోట పనిచేసిన తర్వాతే బదిలీ చేసేవారు. దాన్ని 5 సంవత్సరాలకు తగ్గిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలా కాకుండా.. గతంలో మాదిరిగానే 8 సంవత్సరాలు ఒకే చోట పనిచేసేలా ఉండాలని సీఎంను కోరగా.. సానుకూలంగా  స్పందించారు’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని