Andhra News: హ్యాపీనెస్ట్‌ జాప్యంపై సీఆర్డీఏకు లీగల్‌ నోటీసులు

హ్యాపీనెస్ట్‌ జాప్యంపై సీఆర్డీఏకు 28 మంది లీగల్‌ నోటీసులిచ్చారు. 2018లో సీఆర్డీఏ ద్వారా హ్యాపీనెస్ట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

Updated : 23 Feb 2022 15:28 IST

అమరావతి: హ్యాపీనెస్ట్‌ జాప్యంపై సీఆర్డీఏకు 28 మంది లీగల్‌ నోటీసులిచ్చారు. 2018లో సీఆర్డీఏ ద్వారా హ్యాపీనెస్ట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందుబాటు ధరల్లో టవర్స్‌, 1200 ప్లాట్స్‌ నిర్మాణానికి నిర్ణయం జరిగింది. దీంతో గంటలో మొత్తం ప్లాట్స్‌ అమ్ముడుపోవడంతో ప్రాజెక్టుకు డిమాండ్‌ పెరిగింది. సీఆర్డీఏ ఒప్పందం మేరకు కొనుగోలుదారులు తొలి వాయిదాగా 10శాతం చెల్లించారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి షాపూర్‌జీ పల్లోంజీ టెండర్లకు ముందుకొచ్చింది. డిసెంబర్‌ 31, 2021 నాటికి ప్లాట్లు అందజేయాలని ఒప్పందం జరిగింది.

ఆ గడువు తీరడంతో చెల్లించిన 10శాతం సొమ్ముతో పాటు అదనంగా 14శాతం వడ్డీ చెల్లించాలని కొనుగోలుదారులు సీఆర్డీఏకు నోటీసులు ఇచ్చారు. నష్టపరిహారం కింద రూ.20లక్షలు ఇవ్వాలని అందులో వెల్లడించారు. దీంతో పాటు సీఆర్డీఏపై రేరా చట్టం కింద కేసు వేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌ ద్వారా సీఆర్డీఏ అధికారులకు కొనుగోలుదారులు నోటీసులు పంపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని