రాజేంద్రనగర్‌లో ఆవుపై చిరుత దాడి

రాజేంద్రనగర్‌ పరిసరాల్లో మరోసారి చిరుత కదలికలు కలకలం రేపుతున్నాయి. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాలంటరీ రైస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ వద్ద ఆవుపై చిరుత దాడి చేసిందని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు....

Updated : 15 Feb 2021 19:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజేంద్రనగర్‌ పరిసరాల్లో మరోసారి చిరుత కదలికలు కలకలం రేపుతున్నాయి. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాలంటరీ రైస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ వద్ద ఆవుపై చిరుత దాడి చేసిందని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ఆదివారం రాత్రి రెండు లేగ దూడలపై చిరుత దాడి చేసిందని స్థానికులు వెల్లడించారు. చిరుత కదలికలతో జనం భయాందోళనకు గురవుతున్నారు.

రాజేంద్రనగర్‌లోని అటవీ ప్రాంతంలో పలుమార్లు చిరుత దర్శనమిచ్చింది. గతేదాడి జూన్‌లోనూ వ్యవసాయ పరిశోధనా విస్తరణ సంస్థ, గ్రేహౌండ్స్‌ ఫైరింగ్‌ శిక్షణ ప్రాంతంలో సంచరించింది. గ్రేహౌండ్స్‌ ఫైరింగ్‌ రేంజ్‌ పరిసరాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని