తిరుమల వీధుల్లో చిరుత సంచారం

కరోనావైరస్‌ కారణంగా గత ఐదు నెలలుగా తిరుమలకు భక్తుల రాకపోకలు తగ్గిపోయింది. తితిదే అధికారులు కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. దీంతో తిరుమల వీధులన్నీ ఖాళీగా...

Updated : 02 Sep 2020 17:03 IST

తిరుమల: కరోనావైరస్‌ కారణంగా గత ఐదు నెలలుగా తిరుమలకు భక్తుల రాకపోకలు తగ్గిపోయింది. తితిదే అధికారులు కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. దీంతో తిరుమల వీధులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జనసంచారం లేకపోవడంతో శేషాచల అటవీ ప్రాంతంలోని జంతువులు తిరుమలలోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు రాత్రి సమయాల్లో చిరుతలు, ఎలుగుబంట్లు బయటకు వస్తున్నట్లు స్థానికులు తెలిపారు. తాజాగా మంగళవారం రాత్రి చిరుత సంచరించినట్లు అధికారులు గుర్తించారు. రాత్రి 10.30 నుంచి 11 గంటల ప్రాంతంలో చిరుత సంచరించినట్లు గుర్తించారు. పశ్చిమ మాఢవీధికి సమీపంలో ఉన్న మ్యూజియం వద్ద చిరుత కాసేపు సంచరించింది. తర్వాత మ్యూజియం గోడపై ఉన్న చిరుత.. కాసేపటి తర్వాత అడవిలోకి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించాయి.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని