తిరుమలలో చిరుత సంచారం

తిరుమల మొదటిఘాట్‌రోడ్డులో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. రెండు రోజులక్రితం రెండవ ఘాట్‌రోడ్డులో చిరుత రోడ్డును దాటుతుండగా భక్తులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన..

Updated : 12 Jul 2021 04:05 IST

తిరుమల: తిరుమల మొదటిఘాట్‌రోడ్డులో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. రెండు రోజులక్రితం రెండవ ఘాట్‌రోడ్డులో చిరుత రోడ్డును దాటుతుండగా భక్తులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన విషయం తెలిసిందే. తాజాగా.. ఆదివారం మొదటిఘాట్‌రోడ్డులోని ఏనుగుల ఆర్చివద్ద చిరుత రోడ్డుకు పక్కనే ఉన్న చెట్టుకింద జింకల కోసం వేచి ఉంది. ఘాట్‌రోడ్డులో వాహనాల్లో ప్రయాణిస్తున్న భక్తులు చిరుతను గమనించి తమ సెల్‌ఫోన్‌లలో చిరుతను చిత్రీకరించారు. సాధారణంగా ఈ మార్గంలో భక్తులు రోడ్డు పక్కన ఉన్న జింకలకు ఆహారాన్ని అందిస్తుంటారు. దీంతో తరచూ జింకలు ఘాట్‌రోడ్డు పక్కగా వేచి ఉంటాయి. ఇదే సమయంలో ఆహారం కోసం చిరుత ఘాట్‌రోడ్డు పక్కకు వస్తోంది. తరచూ చిరుతలు ఘాట్‌రోడ్డులో కనిపిస్తుడడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తితిదే అటవీశాఖ అధికారులు జింకలకు ఆహారాన్ని అందించవద్దని సూచిస్తున్నా... భక్తులు వినడం లేదు. దీంతో జింకల కోసం పులులు రోడ్డు వరకు వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని