గ్రేటర్‌ ఎన్నికలు.. భారీగా మద్యం అమ్మకాలు

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. నవంబర్‌లో గడిచిన మూడు వారాల్లో రూ.1,708 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.

Published : 24 Nov 2020 01:49 IST

హైదరాబాద్‌: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. నవంబర్‌లో గడిచిన మూడు వారాల్లో రూ.1,708 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. మొదటి రెండు వారాలు సగటున రూ.520కోట్ల విలువైన అమ్మకాలు జరగ్గా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన మూడో వారంలో ఏకంగా రూ.662కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు గణాంకాల్లో వెల్లడైంది. గ్రేటర్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన ఈ నెల 17వ తేదీన రూ.104కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 18వ తేదీన రూ.84కోట్లు, 19న రూ.90కోట్లు, 20న రూ.85కోట్లు, 21వ తేదీన రూ.140కోట్ల విలువైన మద్యంఅమ్ముడుపోయినట్లు అబ్కారీ శాఖ అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. జీహెచ్ఎంసీలో నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి విక్రయాలు క్రమంగా పెరుగుతున్నట్లు అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు