Amaravati: లింగమనేని రమేష్‌ ఇంటి జప్తు కేసు.. ఈ దశలో అనుమతి ఇవ్వలేమన్న ఏసీబీ కోర్టు

ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న  లింగమనేని రమేష్‌ ఇంటిని జప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌పై ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.

Updated : 06 Jun 2023 17:28 IST

విజయవాడ: ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న  లింగమనేని రమేష్‌ ఇంటిని జప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌పై ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. అటాచ్‌మెంట్‌కు అనుమతించాలంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా?లేదా? అనే విషయాన్ని జప్తు కోసం అభ్యర్థించిన అధికారిని తాము విచారించాల్సిన అవసరముందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మే 18న నోటీసు జారీ చేసినందున లింగమనేని రమేష్‌కు కేసు దస్త్రాలు ఇవ్వాలని సీఐడీని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా పడింది. అటాచ్‌ మెంట్‌ వ్యవహారంలో విచారణ జరిపే అధికారి ఏసీబీ కోర్టుకు ఉందని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని