
AP: మద్యం అమ్మకం వేళలు కుదింపు
అమరావతి: ఏపీలో కరోనా ఉద్ధృతిని కట్టడి చేసేందుకు బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మద్యం అమ్మకాల వేళలను కుదించారు. దీంతో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరిచి ఉండనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే 20వేలకు పైగా కొవిడ్ కొత్త కేసులు రాగా.. 82మందికి పైగా మరణించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.