
ఆశీర్వదిస్తుంటే, హైఫైవ్ కొట్టింది..వైరల్
దిల్లీ: చర్చిలో ఫాదర్ ఆశీర్వదిస్తున్న సందర్భంలో ఓ చిన్నారి అమాయకపు చర్య సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. నెటిజన్ల పెదాలపై చిరునవ్వులు పూయిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే..తెల్లని దుస్తుల్లో, దానికి తగ్గట్టుగా మాస్క్ ధరించి అందంగా ముస్తాబైన ఓ పాప తన తల్లితో కలిసి చర్చిలో ఫాదర్ వద్ద ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లింది. అప్పుడు ఫాదర్ ఆశీర్వదించడానికి చేయిపైకెత్తగానే ఆ చిన్నారి వెంటనే హైఫైవ్ అంటూ తన చేయిపైకెత్తింది. ఆ బాలిక అమాయకపు చర్యకు ఆయన కూడా ఆశ్చర్యపోయి, నవ్వును ఆపుకుంటూనే ఆ తల్లీకూతుళ్లను ఆశీర్వదించారు. మరోవైపు బాలిక చేయిని ఆమె తల్లి పట్టుకోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది.
‘ఫాదర్ ఆశీర్వాదం ఇవ్వడం. ఆ పాప అమాయకత్వం. నవ్వకూడదని వారు ప్రయత్నించడం. మంచి విషయాన్ని ఈ రోజు చూడండి’ అంటూ ఓ నెటిజన్ ఈ వీడియోను షేర్ చేశారు. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న ఈ వీడియోకు పెద్దఎత్తున లైక్స్, కామెంట్లు వచ్చాయి. అయితే ఇంకేం, మీరు ఓసారి ఆ వీడియో చూసేయండి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Related-stories News
Mothers Love: తల్లి ప్రేమకు కరిగిన ఉగ్రవాదులు..
-
Related-stories News
West Bengal: బెంగాల్‌ను హడలగొడుతున్న నైరోబీ ఈగ
-
Ap-top-news News
Andhra News: ‘ఎమ్మెల్సీ అనంతబాబు కుటుంబం నుంచి ప్రాణహాని’
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07-07-2022)
-
World News
Kaali Poster: దర్శకురాలి పోస్టును తొలగించిన ట్విటర్.. క్షమాపణ చెప్పిన కెనడా మ్యూజియం
-
India News
Dilip Ghosh: ‘కడుపు నిండా తిని ఇఫ్తార్ విందులకు వెళ్తారు’.. దీదీపై భాజపా నేత విమర్శలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- పాటకు పట్టం.. కథకు వందనం
- Chintamaneni: పటాన్చెరులో కోడి పందేలు.. పరారీలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని
- Amazon Prime Day sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్ తేదీలు ఫిక్స్.. ఈ కార్డులపై ప్రత్యేక ఆఫర్లు!
- Bhagwant Mann: పంజాబ్ సీఎంకు కాబోయే సతీమణి గురించి తెలుసా?
- Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్.. మోదీ కంగ్రాట్స్
- Kaali Poster: దర్శకురాలి పోస్టును తొలగించిన ట్విటర్.. క్షమాపణ చెప్పిన కెనడా మ్యూజియం
- అలుపు లేదు... గెలుపే!
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!