The parle G girl: ఆధార్‌ ఫొటోకి మోడల్‌గా మారి ఫోజులిచ్చిన చిన్నారి.. వీడియో వైరల్

ఆధార్‌ కేంద్రానికి ఫొటో దిగడానికి వచ్చిన ఓ పాప వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది.

Published : 07 Jul 2024 20:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సాధారణంగా ఆధార్‌ సెంటర్‌ (Aadhaar enrollment centre)కు అడ్రస్‌, పేరు, మొబైల్‌ నంబర్‌ మార్చడానికో... ఫొటో అప్‌డేషన్‌ కోసం వెళుతుంటాం కదా! కానీ, ఈ చిన్నారి మాత్రం ఆధార్‌ కేంద్రానికి వచ్చి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయిపోయింది. చందమామలాంటి ముఖంతో, తన చిట్టి చిట్టి చేతులను రెండు బుగ్గలపై పెట్టుకుని డ్యాన్స్‌ చేస్తూ... ఆధార్‌కార్డ్‌ ఫొటో (Aadhaar card photo) పోజులిచ్చింది. కానీ, ఆపరేటర్‌ మాత్రం చాలా ఓపికగా ఆమె ఫొటోను క్యాప్చర్‌ చేయడానికి ప్రయత్నించాడు. తాజాగా ఈ వీడియో ఇన్‌స్టాలో (Instagram) 18.3 మిలియన్‌ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఆ చిన్నారిని ‘పార్లే జీ గర్ల్‌’ అని పేరు కూడా పెట్టేశారు. ఈ వీడియోని చూసిన ఒక నెటిజన్‌ స్పందిస్తూ ‘ది పార్లే జీ గర్ల్‌’ అని అభివర్ణించాడు. మరొకరు ‘పాప ఆనందం చూస్తుంటే అంత ప్రేమను పంచే తల్లిదండ్రులు దొరకడం అదృష్టం’ అంటూ పోస్ట్‌ చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని