TS: లాక్‌డౌన్‌ ప్రచారం.. నిజం కాదు!

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించాలని వైద్యారోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పలు ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ స్పష్టం చేశారు..

Updated : 29 Apr 2021 12:27 IST

తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌

హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించాలని వైద్యారోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు పలు ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖ అటువంటి ప్రతిపాదనలేమీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపలేదని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ‌లో కొవిడ్ కేసుల పెరుగుద‌ల‌ స్థిరంగా ఉందన్నారు. ప్రజలు ఇలాగే ప్రభుత్వానికి సహకరిస్తూ జాగ్రత్తలు పాటిస్తే మ‌రో మూడు నాలుగు వారాల్లో వైర‌స్ అదుపులోకి వ‌స్తుందని తెలిపారు. అందువల్ల రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టాల‌నే ఆలోచ‌న కానీ, ప్రతిపాదనలు కానీ ఏమీ ఇవ్వలేదన్నారు. క‌నీసం అటువంటి ఉద్దేశం కూడా వైద్యారోగ్య శాఖ‌కు లేదని డా.శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని