స్త్రీ, పురుష సమానత్వం పెంచిన లాక్‌డౌన్‌..!

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా భారతదేశంలో స్త్రీ, పురుష సమానత్వం పెరిగిందట. ఈ విషయాన్ని లింక్‌డ్‌ఇన్‌ అనే సంస్థ విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడించింది. లాక్‌డౌన్‌ కారణంగా కంపెనీలు ఇచ్చిన

Updated : 27 Feb 2024 15:29 IST

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా భారతదేశంలో స్త్రీ, పురుష సమానత్వం పెరిగిందట. ఈ విషయాన్ని లింక్‌డ్‌ఇన్‌ అనే సంస్థ విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడించింది. లాక్‌డౌన్‌ కారణంగా కంపెనీలు ఇచ్చిన  ‘వర్క్‌ ఫ్రం హోం’ అవకాశాన్ని భారతీయ మహిళలు చక్కగా సద్వినియోగం చేసుకున్నారని ఆ సంస్థ నివేదికలో వెల్లడైంది. ఈ అవకాశంతో అనువైన వేళల్లో పనిచేయడానికి ఆసక్తి చూపిన మహిళలు దాదాపు 8శాతం పెరిగారని సర్వే పేర్కొంది. దీంతో లాక్‌డౌన్‌లో దేశవ్యాప్తంగా పనుల్లో నిమగ్నమైన మహిళల సంఖ్య ఏప్రిల్‌లో 30శాతం ఉండగా.. జులైలో అది 37శాతానికి పెరిగినట్లు వెల్లడించింది.

దీనిపై లింక్‌డ్‌ఇన్‌ ప్రతినిధి పెయి యింగ్‌ చువా మాట్లాడుతూ.. ‘భారత్‌లో వర్క్‌ ఫ్రం హోమ్‌ పద్దతి స్త్రీ, పురుష సమానత్వాన్ని పెంచింది. కీలక రంగాల్లో మహిళలు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని భారీగా కల్పించింది. లాక్‌డౌన్‌ కారణంగా వచ్చిన ఈ వర్క్‌ ఫ్రం హోమ్‌ కాన్సెప్ట్‌ మహిళలకు తమకు అనువైన పని వేళలను కల్పిస్తోంది. ఇంట్లో వారు సైతం వారికి సహకరించడంతో వారు తమ కెరీర్‌ను తాజాగా పునర్నిర్మాణం చేసుకుంటున్నారు’ అని ఆయన తెలిపారు. 

లాక్‌డౌన్‌లో తయారీ రంగాన్ని పక్కన పెడితే ఇతర చాలా రంగాల్లో మహిళల ప్రాతినిథ్యం పెరిగింది. తదనంతర నెలల్లో ఆ పెరుగుదల అదేవిధంగా కొనసాగింది. ఎక్కువగా కార్పొరేట్‌ సేవలు, విద్య, ఆరోగ్యం, మీడియా, కమ్యూనికేషన్‌ రంగాల్లో వీరి పెరుగుదల శాతం కనిపించింది. ఇంటి బాధ్యతలు ఉన్నప్పటికీ వర్క్‌ఫ్రం హోం ద్వారా ఈ రంగాల్లో వారికి అనువైన పని వేళలు దొరకడమే వారికి సదవకాశంగా మారిందని నివేదిక వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని