ఆన్‌లైన్‌కి బానిసగా మారుతున్న కౌమారప్రాయం

ఒంటరితనాన్ని అనుభవించే కౌమార దశ పిల్లలు అంతర్జాలానికి బానిసలవుతున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. కౌమారదశ పిల్లల్లో అంతరర్జాల వినియోగం ఒక వ్యసనంగా మారుతోందని యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకీ నిర్వహించిన సర్వే వెల్లడించింది....

Published : 03 Mar 2021 15:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒంటరితనాన్ని అనుభవించే కౌమార దశ పిల్లలు అంతర్జాలానికి బానిసలవుతున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. కౌమారదశలోని వారికి అంతర్జాల వినియోగం ఒక వ్యసనంగా మారుతోందని యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకీ నిర్వహించిన సర్వే వెల్లడించింది. ముఖ్యంగా 16 ఏళ్ల వయసున్నవారు ఇంటర్నెట్‌కు బానిసలుగా మారుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో భాగంగా 16, 17, 18 ఏళ్ల వయసున్న అమ్మాయిలు, అబ్బాయిల అంతర్జాల వినియోగంపై పరిశోధనలు చేశారు. 

కరోనా కాలంలో స్కూళ్లు, కాలేజీలు లేకపోవడం, ఇంట్లోనే ఉండాల్సి రావడంతో వారిలో ఒంటరితనం పెరిగినట్లు గుర్తించారు. ఫలితంగా అంతర్జాల వినియోగం బాగా పెరిగిందన్నారు. 16 ఏళ్ల వయసు పిల్లలు ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ, సామాజిక మాధ్యమాలు చూస్తూ సమయం గడుపుతున్నట్లు సర్వేలో తేలింది. ఇంటర్నెట్‌ అతి వినియోగం వారిపై ఒత్తిడిని పెంచుతుందని తెలిపారు. వయసు పెరిగేకొద్దీ మానసిక ఎదుగుదల కారణంగా అంతర్జాల వినియోగంపై స్వీయ నియంత్రణ పాటిస్తున్నారని వారు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని