Harsh Goenka: ఇది ఫెని ఎఫెక్ట్.. అందుకే రెండు పార్టీలకు ఒకే ట్రక్కు నుంచి ప్రచారం..!
ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంటారు. తమ పార్టీ, ఎన్నికల గుర్తు ప్రజల మదితో నాటుకుపోయేలా వారి ప్రచారం ఉంటుంది. అయితే ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా షేర్ చేసిన ట్వీట్ మాత్రం నవ్వులు పూయిస్తోంది.
పనాజీ: ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంటారు. తమ పార్టీ, ఎన్నికల గుర్తు ప్రజల మదితో నాటుకుపోయేలా వారి ప్రచారం ఉంటుంది. అయితే ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా షేర్ చేసిన ట్వీట్ మాత్రం నవ్వులు పూయిస్తోంది.
ఓ అభ్యర్థి తన పేరు, పార్టీ పేరు, గుర్తు తెలిసేలా ట్రక్కుకు పోస్టర్లు అంటించి గోవా వీధుల్లో దాన్ని తెగ తిప్పుతున్నారు. ఆ వ్యక్తిది కాంగ్రెస్ పార్టీ. ఆ పోస్టర్లపై హస్తం గుర్తు స్పష్టంగా కనిపిస్తోంది. విచిత్రంగా ట్రక్కు లోపల ఓ వ్యక్తి నిల్చొని భాజపా జెండా ఊపుతూ నినాదాలు చేస్తున్నాడు. హర్ష ఈ వీడియోను షేర్ చేసి..‘ట్రక్కు వైపు, జెండా వైపు చూడండి. గోవాలో ఫెని ప్రభావం’ అని రాసుకొచ్చారు. గోవాలో ఉత్పత్తి చేసే ఆల్కహాల్‌ను ఫెని అని పిలుస్తారు.
ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 14న గోవా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 40 స్థానాలకు ఓటింగ్ జరిగింది. దాదాపు 80 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో ఎప్పటిదో తెలియాల్సి ఉంది. అలాగే పార్టీలు ఫిరాయించే నేతల విషయంలో కూడా ఇలాంటి అనుభవాలున్నాయి. కొత్తగా చేరిన పార్టీ తరఫున ప్రచారం చేస్తూ.. గతంలో ఉన్న పార్టీ గుర్తుకు ఓటేయమని అడిగిన సంఘటనలు వైరల్ అయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్‌రెడ్డి