Tirumala: తిరుమల దేవదేవుడు భువిపైకి వచ్చిన మాసం..

పురటాసి తమిళ పంచాంగం సౌరమానం ప్రకారం జరుగుతుంది. తెలుగువారిది చంద్రమానం ప్రకారం ఉంటుంది.

Updated : 22 Sep 2021 20:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పురటాసి మాసం తమిళ పంచాంగం సౌరమానం ప్రకారం వస్తుంది. తెలుగువారిది చంద్రమానం ప్రకారం ఉంటుంది. మన భాద్రపద మాసాన్నే తమిళులు పురటాసి అని అంటారని చెప్పవచ్చు. ఈ మాసం అత్యంత విశిష్టమైనది.

శ్రీనివాసుడు భువికి వచ్చిన మాసమిదే..

తమిళ ఆధ్యాత్మిక సంప్రదాయం ప్రకారం తిరుమల శ్రీనివాసుడు వైకుంఠం నుంచి భువికి విచ్చేసిన మాసం కావడంతో ద్రవిడ సీమలో వైష్ణవాలయాలు దివ్యశోభను సంతరించుకుంటాయి. ఇక కలియుగ వైకుంఠం తిరుమలలో సంబరాలు అంబరాన్ని తాకుతాయి. ఈ నెలలో వచ్చే శనివారాల్లో తమిళనాడు నుంచి వచ్చే భక్తులతో తిరుమలగిరులు గోవింద స్మరణతో మార్మోగుతాయి. 

పడవేడు కొట్టమలై

తమిళనాడులోని వేలూరు సమీపంలోని కొట్టమలై కొండపై నున్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో మరో అద్భుతం జరుగుతుంది. కేవలం శనివారాలు మాత్రమే దర్శనం లభించే ఈ ఆలయంలో సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలపై ప్రసరిస్తాయి. ఈ దివ్యఘట్టాన్ని వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు అక్కడికి తరలివస్తారు. 

దీపాల వెలుగు..

ఈ మాసంలోని శనివారాల్లో ప్రతి ఇంట్లో మావిలక్కు అని దీపారాధన చేస్తారు.  ప్రత్యేకించి బియ్యపుపిండితో చేసిన నేతిదీపాల్లో దీపాలను వెలిగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని