Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాలు.. మోహినీ అవతారంలో మలయప్పస్వామి దర్శనం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Updated : 01 Oct 2022 12:53 IST

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ వేంకటేశ్వరస్వామి మోహినీ అవతారంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పక్కనే దంతపు పల్లకిపై కృష్ణుడి రూపంలోనూ శ్రీవారు భక్తులకు అభయప్రదానం చేశారు. క్షీర సాగర మథనంలో మోహినిగా స్వామివారు ఉద్భవించారు. అసురులను మాయచేసి, సురులకు అమృతం పంచినట్లు పురాణ గాథ. ప్రపంచమంతా మాయా విలాసమని.. తన భక్తులు కానివారు మాయాధీనులు కాకతప్పదని స్వామివారు బోధించారు. మాయా జగత్తు నుంచి భక్తులను బయటపడేయటమే మోహినీ రూపం పరమార్థం. ఏపీ హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని