Simha Vahana Seva: తిరుమలలో వైభవంగా మలయప్పస్వామి సింహ వాహన సేవ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి.

Updated : 29 Sep 2022 10:10 IST

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం స్వామివారు సింహ వాహనంపై యోగ నృసింహుడిగా మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. జగన్నాయకుడి అవతారాల్లో నాలుగోది నృసింహ అవతారం. దుష్టజన శిక్షణకు, శిష్టజన రక్షణకు సింహ వాహనం ప్రతీతి. యోగ శాస్త్రంలో వాహన శక్తికి, శీఘ్ర గమన శక్తికి సింహం ఆదర్శం. విష్ణు సహస్ర నామాల్లో స్వామికి నామాంతరంగా సింహః స్తోత్రం ఉంటుంది. సింహ బలమంత భక్తిబలం కలిగి ఉన్నవారికి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు