Tirumala: గ‌జ వాహ‌నంపై మ‌ల‌య‌ప్పస్వామి క‌టాక్షం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి వాహన సేవలు నయనానందకరంగా సాగుతున్నాయి. ఆరోరోజు ఆదివారం రాత్రి స్వామి వారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

Published : 02 Oct 2022 21:26 IST

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి వాహన సేవలు నయనానందకరంగా సాగుతున్నాయి. ఆరోరోజు ఆదివారం రాత్రి స్వామి వారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. జాజి పువ్వులు, పట్టువస్త్రాలు, నీలిమణులు, మాణిక్యాలతో అలంకార ప్రియుడైన మలయప్పస్వామి భక్తులకు అభయప్రాదనం చేశారు. వాహన సేవలో గజరాజులు ముందుకు సాగగా... కళాకారుల కోలాటాలు, భజన బృందాలు తిరువీధుల్లో సందడి చేశాయి. గజవాహనంపై మాడవీధుల్లో ఊరేగుతున్న మలయప్పస్వామిని దర్శించుకున్న భక్తులు పారవశ్యంతో పొంగిపోయారు. గోవిందనామం స్మరిస్తూ స్వామివారికి కర్పూర హారతులిచ్చి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, చినజీయర్‌స్వామి, తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి దంపతులు, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని