అదృష్టం అంటే ఇతడిదే..!

ఈ-కామర్స్‌ సంస్థలు అందుబాటులోకి వచ్చాక ఒక్క క్లిక్‌తో కోరిన వస్తువులు సులభంగా మన ఇంటికే వచ్చి చేరుతున్నాయి. అయితే వీటి వల్ల లాభాలతో... 

Updated : 09 Dec 2022 15:48 IST

దిల్లీ: ఈ-కామర్స్‌ సంస్థలు అందుబాటులోకి వచ్చాక ఒక్క క్లిక్‌తో కోరిన వస్తువులు సులభంగా మన ఇంటికే వచ్చి చేరుతున్నాయి. అయితే వీటి వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. ఒక్కోసారి మనం ఆర్డర్‌ చేసిన వస్తువు కాకుండా రాళ్లు, ఖాళీ బాక్సులు డెలివరీ అవుతుంటాయి. దీని వల్ల కొనుగోలుదారులు నష్టపోతుంటారు. అయితే, ఇతగాడి విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరిగింది.

గౌతమ్‌ రెగె అనే వ్యక్తి అమెజాన్‌లో రూ.300 విలువైన బాడీ క్రీమ్‌ ఆర్డర్ చేశాడు. అందుకు బదులుగా రూ.19,000 ఖరీదు చేసే బోస్‌ హెడ్‌ఫోన్స్‌ రావడంతో ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు. అయితే ఆ వస్తువుని తిరిగి సంస్థకు ఇచ్చేందుకు గౌతమ్‌ కస్టమర్‌కేర్‌కి ఫోన్‌ చేస్తే వారు ఇచ్చిన సమాధానం అతడిని మరింత అశ్చర్యానికి గురిచేసింది.

అతడికి డెలివరీ చేసిన వస్తువుకి రిటర్న పాలసీ లేదని, అందుచేత సదరు వస్తువును తన వద్దనే అట్టిపెట్టుకోవాలని సూచించారు. దీంతో సంతోషం వ్యక్తం చేస్తూ గౌతమ్‌ తన అనుభవాన్ని ట్విటర్లో వెల్లడించారు. అయితే గౌతమ్‌ ట్వీట్ చూసిన నెటిజన్లు ‘‘మీరు ఆర్డర్ చేసిన బాడీ లోషన్ ఇంకా స్టాక్‌ ఉంటే మాకూ ఆ లింక్ పంపండి. మేమూ ప్రయత్నిస్తాం’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని