లగ్జరీ కారులో ఇంటికి వెళ్లాలా నాయనా!

రోడ్డుపైన అలా వెళ్తుంటే ఓ లగ్జరీ కారు కనిపిస్తుంది. చూడగానే.. ‘అబ్బా ఎంత బాగుందో కారు. అలాంటి కారు మనకు లేదు కదా. కానీ అవకాశం వస్తే ఒక్కసారి అయినా అలాంటి కారును డ్రైవ్ చేయాలి.. అందులో ప్రయాణించాలి’ అని అనుకుంటాం..

Published : 17 Apr 2021 23:45 IST

జీఎంఆర్ ఇంటర్నేషనల్ వినూత్న ఆలోచన

హైదరాబాద్‌: రోడ్డుపైన అలా వెళ్తుంటే ఓ లగ్జరీ కారు కనిపిస్తుంది. చూడగానే.. ‘అబ్బా ఎంత బాగుందో కారు. అలాంటి కారు మనకు లేదు కదా. కానీ అవకాశం వస్తే ఒక్కసారి అయినా అలాంటి కారును డ్రైవ్ చేయాలి.. అందులో ప్రయాణించాలి’ అని అనుకుంటాం. సరిగ్గా అలాంటి వారి కోసం హైదరాబాద్‌ జీఎంఆర్ ఇంటర్నేషనల్ వినూత్న ఆలోచన చేసింది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్‌జీఐఏ)లో దిగగానే ఒక్క క్లిక్‌తో లగ్జరీ కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికెళ్లే అవకాశాన్ని కల్పిస్తోంది. దేశంలోనే మొదటిసారిగా ఓ సరికొత్త ఆలోచనకు జీఎంఆర్ ఇంటర్నేషనల్ శ్రీకారం చుట్టింది.

ఆర్‌జీఐఏలో విమానం దిగిన వెంటనే అత్యాధునిక, ఖరీదైన కార్లను అద్దెకు ఇస్తున్నట్లు జీఎంఆర్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. విమానాశ్రయం అరైవల్స్ వద్ద ఉన్న 4వీల్ సంస్థ లగ్జరీ కార్లను అద్దెకు అందిస్తోందని జీఎంఆర్ పేర్కొంది. పోర్షే, జాగ్వార్, లంబోర్గినీ, లెక్సస్, ఆడి, మెర్సిడెస్‌-బెంజ్‌ , బీఎండబ్ల్యూ, బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఫోర్డ్, వోల్వో, టయోటా,మారుతీ సుజుకీ లాంటి కంపెనీలకు చెందిన విలాసవంతమైన, లగ్జరీ కార్లను అద్దెకు ఇస్తుంది. ఈ కార్లను అద్దెకు తీసుకున్నవారు వాటిని తామే సొంతంగా నడుపుకోవచ్చు లేదా డ్రైవర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడానికి ముందే వీటిని బుక్ చేసుకోవచ్చని.. ప్రయాణికుల భద్రత కోసం ప్రతి ట్రిప్ తర్వాత కార్లును శానిటైజ్ చేస్తారని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు