మీసాలు ట్రిమ్‌ చేయనందుకు ఉద్యోగం నుంచి సస్పెండ్‌!

మిమల్ని ఉద్యోగం నుంచి ఎందుకు సస్పెండ్‌ చేశారంటే సదరు వ్యక్తి చెప్పే కారణాలు... అవినీతి, అన్యాయం, అధర్మం, పని పట్ల అశ్రద్ధ, నిర్లక్ష్యం.. ఎవరి నుంచైనా ఇలాంటి ఫిర్యాదులే వింటాం. కానీ మధ్యప్రదేశ్‌ భోపాల్‌లోని ఓ కానిస్టేబుల్‌ని సస్పెండ్‌ చేసిన తీరు తెలిస్తే మాత్రం ఇదేం విడ్డూరం అనక మానదు.

Updated : 10 Jan 2022 04:44 IST

భోపాల్‌: మీసాలు ట్రిమ్‌ చేయడానికి నిరాకరించాడనే కారణంతో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. తనను ఉద్యోగం నుంచి తొలగించినా సరే ఈ విషయంలో రాజీపడేది లేదంటున్నాడు ఆ కానిస్టేబుల్‌. అసలేం జరిగిందంటే..?

మధ్యప్రదేశ్‌ పోలీస్‌ శాఖలో రాకేశ్‌ రానా అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా నియమితులయ్యారు. విధుల్లో ఉండగా మీసాలను ట్రిమ్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. వాటిని పాటించేందుకు నిరాకరించాడట రాకేశ్‌ రానా. దీంతో నిబంధనలను పాటించనందుకు గానూ అతడిని సస్పెండ్‌ చేశారు. ‘‘పోలీస్ శాఖలో ఇలాంటి వైఖరిని ప్రోత్సహించం. మీసాన్ని మెడవరకూ పెంచాడు. వాటిని ట్రిమ్‌ చేయకుండా వస్తే.. అక్కడ పని చేసే సిబ్బందిపైనా రానా ప్రభావం పడేలా ఉంది. అందుకే విధుల నుంచి సస్పెండ్‌ చేయాల్సి వచ్చింది’’ అని అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ప్రశాంత్‌ వర్మ తెలిపారు.

జరిగిన ఘటనపై రాకేశ్‌ రానా స్పందించాడు. ‘‘ఉద్యోగంపరంగా ఎలాంటి ఫిర్యాదులూ లేవు. నేను రాజ్‌పుత్‌ వంశం నుంచి వచ్చా. మీసాలు ఉండటమే మాకు గర్వకారణం. దాని కోసం సస్పెండ్‌ అయినా ఫర్వాలేదు. కానీ ఈ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదు. నేనెప్పటికీ మీసాలు ట్రిమ్‌ చేయను. ఇది నా ఆత్మగౌరవంతో ముడిపడిన విషయం’’ అని చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు