పొలానికి హెలికాప్టర్‌లో వెళ్లాలి.. రుణం ఇప్పించండి

తమ పొలానికి వెళ్లే అన్ని మార్గాలను మూసేయించడంతో చేసేదేమీలేక ఓ మహిళా రైతు హెలికాప్టర్‌ కొనేందుకు రుణం ఇప్పించాలంటూ ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాశారు. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌కు చెందిన ఓ మహిళా రైతు....

Updated : 14 Feb 2021 04:41 IST

రాష్ట్రపతికి మహిళా రైతు లేఖ

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ పొలానికి వెళ్లే అన్ని మార్గాలను మూసేయించడంతో చేసేదేమీలేక ఓ మహిళా రైతు హెలికాప్టర్‌ కొనేందుకు రుణం ఇప్పించాలంటూ ఏకంగా రాష్ట్రపతికే లేఖ రాశారు. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌కు చెందిన బాసంతి బాయి అనే రైతు హెలికాప్టర్‌ కొనేందుకు రుణం మంజూరు చేయాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు. ఆ హెలికాప్టర్‌ నడిపేందుకు లైసెన్స్‌ ఇప్పించాలని కూడా అందులో పేర్కొన్నారు. శ్యామ్‌గఢ్‌ మండలం ఆగర్‌ గ్రామంలో బాసింతి బాయికి కొంత సాగు భూమి ఉంది. ఆమె కుటుంబం అందులో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే వారి పొలానికి వెళ్లే అన్ని మార్గాలను ఊరి పెద్ద, అతడి కుమారుడు కలిసి ఇటీవల మూసివేయించారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని స్థానిక అధికారులకు బాసంతి పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఇక చేసేదేమీ లేక రాష్ట్రపతికి తమ గోడును విన్నవించుకునేందుకు లేఖ రాసినట్లు బాసింతి పేర్కొన్నారు.

ఇవీ చదవండి...

నాలుగున్నర కిలోల బరువుతో శిశువు జననం

ప్రేమికుల దినోత్సవానికి ప్రత్యేక కానుక
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని