Biryani: 5 పైసలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం

బిర్యానీ సెంటర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా వినూత్న ఆఫర్‌ పెట్టడంతో ప్రజలు ఆ స్టాల్‌ ముందు క్యూ కట్టారు. కొవిడ్‌ నిబంధనలను ఖాతరు చేయకుండా బిర్యానీ కోసం ఎగబడ్డారు....

Updated : 21 Jul 2021 21:17 IST

మధురై: బిర్యానీ సెంటర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా వినూత్న ఆఫర్‌ పెట్టడంతో ప్రజలు ఆ స్టాల్‌ ముందు క్యూ కట్టారు. కొవిడ్‌ నిబంధనలను ఖాతరు చేయకుండా బిర్యానీ కోసం ఎగబడ్డారు. తమిళనాడులోని మదురైకి చెందిన ఓ వ్యాపారి నూతనంగా ఓ బిర్యానీ సెంటర్‌ను ప్రారంభించారు. దాని ప్రమోషన్‌లో భాగంగా.. ఎవరైతే 5 పైసల నాణెం (ప్రస్తుతం వాడకంలో లేదు) తీసుకొస్తారో వారికి బిర్యానీ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. కాగా ఈ ప్రకటనకు ఊహించని స్పందన లభించింది. దాదాపు 300 మంది 5 పైసలతో బిర్యానీ సెంటర్‌ ముందు క్యూ కట్టారు. అందులో చాలా మంది మాస్కులు ధరించలేదు. భౌతిక దూరం నిబంధనను లెక్కచేయకుండా ఒకరిమీద ఒకరు పడ్డారు.

ఈ ఊహించని పరిణామాలతో కంగుతిన్న ఆ షాపు యజమాని షటర్‌ను మూసేయాల్సి వచ్చింది. ప్రజలు గుమిగూడటంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గుమిగూడిన వారిని చెదరగొట్టారు. ఆఫర్‌ ప్రకటించడంతో 5 పైసల కోసం ఇల్లు మొత్తం వెతికామని.. కష్టపడి వాటిని తీసుకొస్తే చివరకు దుకాణాన్ని మూసేశారని కొందరు వాపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని