Yadadri: యాదాద్రిలో నేత్రపర్వంగా మహాకుంభ సంప్రోక్షణ..

యాదాద్రిలో ఆలయ ఉద్ఘాటన ప్రక్రియ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఉద్ఘాటనలో భాగంగా కీలకమైన మహా

Updated : 06 Dec 2022 15:02 IST

యాదగిరిగుట్ట: యాదాద్రిలో ఆలయ ఉద్ఘాటన ప్రక్రియ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఉద్ఘాటనలో భాగంగా కీలకమైన మహా కుంభ సంప్రోక్షణ నేత్రపర్వంగా కొనసాగింది. దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్‌ సమక్షంలో సంప్రోక్షణ నిర్వహించారు. మిథునలగ్నంలో ఏకాదశి సందర్భంగా 11.55 గంటలకు ఈ మహోత్సవం ఆవిష్కృతమైంది. దీనిలో భాగంగా శ్రీ సుదర్శన చక్రానికి యాగజలాలతో సంప్రోక్షణ చేశారు. ప్రధానాలయం గోపురాలపై కలశాలకు కుంభాభిషేకం నిర్వహించారు. 7 గోపురాలపై ఉన్న కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ చేశారు. ఆలయ రాజగోపురాలపై స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ జరిగింది. అనంతరం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరోవైపు ఇదే సమయంలో మిగిలిన ఆలయ గోపురాలకు శాసనసభ స్పీకర్‌, మండలి ఛైర్మన్‌, మంత్రులు ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12.20 నిమిషాల నుంచి గర్భాలయంలోని మూలవరుల దర్శనం మొదలైంది. అనంతరం సీఎం కేసీఆర్‌ దంపతులు స్వామివారికి తొలిపూజ చేశారు. ఆ తర్వాత ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన ప్రముఖ ఆర్కిటెక్ట్‌ ఆనందసాయితో పాటు మరికొంతమందిని సీఎం, మంత్రులు సన్మానించారు. యాదాద్రి ఆలయ ఉద్ఘాటన సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని