తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం మల్లన్న క్షేత్రం, శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరస్వామి...

Updated : 11 Mar 2021 11:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం మల్లన్న క్షేత్రం, శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరస్వామి ఆలయం,  అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయం, మహానంది, కోటప్పకొండలోని త్రికూటేశ్వరస్వామి ఆలయాలకు వేకువజాము నుంచే  పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శ్రీశైలంలో అర్ధరాత్రి 2 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని వేములవాడ రాజన్న  ఆలయం, కీసర రామలింగేశ్వరస్వామి ఆలయం, కాళేశ్వరం, రామప్ప ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. 

మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తాయి. క్యూలైన్లలో తమను పోలీసులు ముప్పుతిప్పలు పెడుతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల కుటుంబాలకు ఆటంకాలు లేకుండా దర్శనాలు కల్పించారని.. తమను గంటల కొద్దీ క్యూలైన్లలో నిల్చోబెట్టారని వాపోయారు. ఈ క్రమంలో భక్తులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

 

 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని