హఫీజ్ సయీద్ నివాసం సమీపంలో బాంబు పేలుడు
ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి, జమాత్ ఉద్ దవా(జీయూడీ) ఉగ్రముఠా నాయకుడు హఫీజ్ సయీద్ నివాసం సమీపంలో భారీ బాంబు పేలుడు సంభవించింది.
లాహోర్: ముంబయి బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కర్ ఉగ్రముఠా నాయకుడు హఫీజ్ సయీద్ నివాసం సమీపంలో భారీ బాంబు పేలుడు సంభవించింది. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న ఆతడి ఇంటి వద్ద బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబు పేలుడు గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స కోసం లాహోర్‌లోని జిన్నా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరిని లక్ష్యంగా చేసుకొని బాంబు దాడి జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. భారత్ గాలిస్తున్న అత్యంత ప్రధానమైన అయిదుగురు ఉగ్రవాదుల్లో హఫీజ్ సయీద్ ఒకడు.
బాంబు పేలుడు ధాటికి సమీపంలోని కొన్ని ఇళ్లు ధ్వంసమైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. హఫీజ్ ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఓ ద్విచక్ర వాహనాన్ని నిలిపాడని.. కొద్ది సేపటి తర్వాత అది పేలిపోయిందని మరో ప్రత్యక్ష సాక్షి వివరించారు. బాంబు దాడిని ఖండిస్తూ పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దార్ ట్వీట్ చేశారు. తాజా ఘటనపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న జిన్నా ఆసుపత్రి ప్రాంతంలో ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్‌కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు