CM KCR: మల్లన్నసాగర్‌ను జాతికి అంకితం చేసిన సీఎం కేసీఆర్‌

కాళేశ్వరం ఎత్తిపోతం పథకంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌లో నిర్మించిన

Updated : 23 Feb 2022 17:53 IST

తొగుట: కాళేశ్వరం ఎత్తిపోతం పథకంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్‌లో నిర్మించిన మల్లన్నసాగర్‌ జలాశయాన్ని సీఎం కేసీఆర్‌ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా భూగర్భంలో ఏర్పాటు చేసిన పంప్‌హౌస్‌లో మోటార్లను సీఎం ప్రారంభించి లాంఛనంగా నీటిని విడుదల చేశారు. దీంతో గోదావరి జలాలు ఒక్కసారిగా పరవళ్లు తొక్కాయి. అనంతరం పంపిణీ వ్యవస్థ వద్దకు వెళ్లి గోదావరి జలాలకు సీఎం కేసీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తదితరు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతిపెద్ద జలాశయంగా మల్లన్నసాగర్‌కు గుర్తింపు ఉంది. 50 టీఎంసీల సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. ఈ జలాశయం నుంచి 15.70లక్షల ఎకరాలకు సాగునీరు చేరనుంది. ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు వరప్రదాయినిగా మల్లన్నసాగర్‌ మారనుంది. ఈ జలాశయంలో 8 పంపులను ఏర్పాటు చేశారు. వీటిలో ఒక్కో పంపు సామర్థ్యం 43 మెగావాట్లు. ఎస్సారెస్పీ తర్వాత అతిపెద్ద రిజర్వాయర్‌గా మల్లన్నసాగర్‌ నిలిచింది. హైదరాబాద్‌ ప్రజలకు తాగునీరు కోసం భవిష్యత్తులో 30 టీఎంసీల నీటిని కేటాయించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని