Viral news: నా పెళ్లికి ఉద్యోగంతో లింక్‌.. జాబ్‌ ఇవ్వండి ప్లీజ్‌!

Viral news: ఉద్యోగం కోసం చేసే దరఖాస్తుల్లో జాబ్‌ రోల్‌ గురించి పేర్కొంటారు. అలా జాబ్‌ రోల్‌లో ఓ వ్యక్తి తన పెళ్లి గురించి ప్రస్తావించడం వైరల్‌గా మారింది.

Published : 15 Jun 2024 00:09 IST

Viral news | ఇంటర్నెట్‌డెస్క్‌: ఉద్యోగం సంపాదించడం రెజ్యూమోను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడం అందరూ దాదాపుగా చేసే పని. ఎన్ని చేసినా ఆ రిక్రూటర్‌ను మెప్పించడం అంత ఈజీ కాదు. అందుకే కొందరు వినూత్న పద్ధతులు అవలంబిస్తుంటారు. డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇవ్వండని అనేవాళ్లూ ఉన్నారు. అయితే తాజాగా ఓ అభ్యర్థి జాబ్‌ రోల్‌లో పెళ్లి గురించి ప్రస్తావించడం కంపెనీ సీఈఓ దృష్టికి వచ్చింది. దాన్ని ఆయన సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అది వైరల్‌గా మారింది.

చిన్నప్పటినుంచి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఓ కుర్రాడు. ఈ విషయాన్ని అమ్మాయి తండ్రికి చెబితే.. ఉద్యోగం ఉంటేనే తన కూతురితో వివాహం జరిపిస్తానని ఆయన కరాఖండీగా చెప్పాడు. దీంతో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనుకున్నాడు. ఇదే విషయాన్ని జాబ్‌ రోల్‌లో పంచుకున్నాడు. ‘‘ఉద్యోగం సంపాదిస్తేనే కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని నా ప్రేయసి తండ్రి చెప్పారు. ఈ ఉద్యోగం రాకపోతే ఎప్పటికీ పెళ్లి చేసుకోలేను’’ అని అందులో పేర్కొన్నారు. ఉద్యోగం కోసం వచ్చిన దరఖాస్తుల్ని పరిశీలించిన అర్వా హెల్త్ వ్యవస్థాపకురాలు, సీఈఓ డిపాలీ బజాజ్ ఈ విషయం చూసి ఆశ్చర్యపోయారు. 

డెలివరీ పార్ట్‌నర్స్‌కు సీపీఆర్‌లో శిక్షణ.. జొమాటో గిన్నిస్‌ రికార్డ్‌

జాబ్‌ రోల్‌కు సంబంధించిన ఫొటోను ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. ‘ఉద్యోగ నియామకం కూడా సరదా అయిపోయింది’ అంటూ క్యాప్షన్‌ జోడించారు. ఈ పోస్ట్‌ కాస్తా నెట్టింట వైరల్‌గా మారిపోయింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘అతడి నిజాయతీ చూసైనా మీరు ఉద్యోగం ఇవ్వాల్సిందే’ అంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేశాడు. ‘వారిద్దరి జీవితాలు ఈ జాబ్‌పైనే ఆధారపడి ఉన్నాయి’ అని మరొకరు ఫన్నీగా కామెంట్‌ చేశాడు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థి దరఖాస్తును స్వీకరించి ఉండరు’ అని మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు. అయితే ఈ దరఖాస్తును స్వీకరించారో లేదా? అనే విషయం మాత్రం ఆమె వెల్లడించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు