
గాయని సునీత ఫిర్యాదుపై యువకుడి అరెస్ట్
హైదరాబాద్: ప్రముఖ గాయని సునీత పేరు ఉపయోగించుకొని డబ్బులు వసూలు చేస్తున్న ఓ యువకుడిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన చైతన్య అనే యువకుడు సునీత అభిమానిగా చెప్పుకొంటూ సామాజిక మాధ్యమాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆమె పేరుపై స్వచ్ఛంద సేవ చేస్తానంటూ వసూళ్లకు పాల్పడ్డాడు. సునీత పేరు మీద నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సైతం తెరిచాడు. ఈ విషయంపై సునీత పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టిన వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై అనంతపురంలోనూ కేసులున్నట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.