
Anand Mahindra: నెటిజన్ సిల్లీ ప్రశ్న.. ఆనంద్ మహీంద్రా అదిరిపోయే రిప్లై!
ఇంటర్నెట్ డెస్క్: సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉంటూ.. ఎన్నో కొత్త విషయాలను పంచుకుంటుంటారు ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా. స్ఫూర్తి నింపే మాటలు చెబుతూనే కొన్నిసార్లు చమత్కారాలు విసురుతారు. నెటిజన్ల నుంచి ఆసక్తికరమైన, వింత ప్రశ్నలు ఎదురైనప్పుడు తనదైన శైలిలో సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా ఎదురైన ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం నవ్వులు పూయిస్తోంది.
మహీంద్రా కార్లను ₹10వేల లోపే తయారు చేయొచ్చు కదా అని ఆనంద్ మహీంద్రాను రాజ్ శ్రీవాత్సవ అనే నెటిజన్ ట్విటర్‌లో ప్రశ్నించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమే కాదు అని చెప్పకనే చెబుతూ ఈ వ్యాపార దిగ్గజం తనదైన శైలిలో అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ‘మేం అంతకంటే చౌకైన వాహనాలను అందిస్తున్నాం. వాటి ధర కేవలం ₹1.5వేల లోపే’ అంటూ.. ఓ ఆన్‌లైన్ వేదికగా విక్రయిస్తున్న థార్ బొమ్మ కారు ఫొటోలను ట్యాగ్ చేస్తూ నవ్వుతున్న ఎమోజీని దీనికి జతచేశారు. మహీంద్రా సమాధానానికి నెటిజన్లు పగలబడి నవ్వుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Union Cabinet: 63వేల PACSల కంప్యూటరీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
-
Sports News
ENG vs IND: ఆ ‘తుపాన్’ మన మీదకొస్తే..!
-
General News
Andhra News: అమరావతి సచివాలయ ఉద్యోగులకు ఉచిత వసతి రద్దు
-
Politics News
AP High court: ఎంపీ రఘురామ కృష్ణరాజు సీఐడీ విచారణకు హైకోర్టు అనుమతి
-
Business News
GST: రాష్ట్రాలకు పరిహారం కొనసాగింపుపై తేలని నిర్ణయం
-
Politics News
Maharashtra: గోవాకు రెబల్ ఎమ్మెల్యేలు.. సుప్రీంలో మొదలైన విచారణ.. ఠాక్రే కేబినెట్ భేటీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్‌ను ఉమ్రాన్‌కు ఇచ్చా : హార్దిక్ పాండ్య
- DilRaju: తండ్రైన దిల్‌రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా