ఆ ఇల్లే కరెన్సీల మ్యూజియం

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన యాసిర్‌ తనకున్న అభిరుచితో ఎన్నో రకాల నాణేలు, నోట్లను సేకరించి వాటిని ప్రదర్శించేందుకు తన ఇంటినే ఓ మ్యూజియంగా మార్చారు....

Published : 17 Feb 2021 06:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాణేలు, నోట్లు సేకరించడం కొంతమందికి హాబీ. తమకున్న ఆసక్తితో వివిధ కాలాలు, దేశాలకు చెందిన నాణేలను సేకరిస్తుంటారు. అలాంటి వ్యక్తే కర్ణాటకకు చెందిన మహమ్మద్‌ యాసిర్‌. దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన యాసిర్‌ తనకున్న అభిరుచితో ఎన్నో రకాల నాణేలు, నోట్లను సేకరించి వాటిని ప్రదర్శించేందుకు తన ఇంటినే ఓ మ్యూజియంగా మార్చారు. 2014లో విడుదలైన 10 రూపాయల నోట్లలో ఒకే సీరియల్‌ నంబర్‌కు చెందిన 200 నోట్లను సేకరించి తన మ్యూజియంలో పొందుపరిచారు. 2003 నుంచి నాణేలను సేకరించడం ప్రారంభించిన యాసిర్‌ ఇప్పటివరకు 202 దేశాల నాణేలు, 194 దేశాలకు చెందిన నోట్లను సేకరించారు. వీటిలో చలామణిలో ఉన్నవి, రద్దయినవి, కొత్తగా విడుదల చేసినవి కూడా ఉన్నాయి. 

ఎందరో ప్రముఖుల పుట్టిన తేదీని ప్రతిబింబించే సీరియల్ నంబర్లతో ఉన్న నోట్లను యాసిర్‌ సేకరించారు. ఈ జాబితాలో 48 మంది ప్రముఖ రచయితలు, 22 మంది ముఖ్యమంత్రులు, 15 మంది ప్రధానమంత్రులు సహా 15 మంది దేశాధ్యక్షులు ఉన్నారు. తన కలెక్షన్‌ను దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనకు ఉంచారు. ఈ మ్యూజియాన్ని సందర్శించేందుకు విదేశీయులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారని యాసిర్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని