Guinness World Records: అరటిపండు తిని.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకెక్కాడు

37.782 సెకన్లలో మొత్తం అరటిపండుని తినేసి గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే తినేక్రమంలో ఏమాత్రం చేతిని ఉపయోగించకపోవడం విశేషం. కెనడాలోని ఒన్‌టారియోకి చెందిన మైక్‌ జాక్‌..  ఓ ఫుడ్‌ కంటెంట్‌ క్రియేటర్‌.

Updated : 06 Dec 2023 14:55 IST

ఎలా సాధ్యమైందంటే..

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఓ ఐడియా అతడి జీవితాన్నే మార్చేసిందంటారు. ఇక్కడ మాత్రం ఓ అరటిపండు అతడి జీవితాన్నే మార్చేసింది. ఏకంగా ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించేలా చేసింది. ఇదంతా అతడికి ఎలా సాధ్యమైందంటే.. అరటిపండు మనచేతికిస్తే.. తినిపక్కన పాడేస్తాం. తినడానికి కనీసం రెండు నిమిషాలైనా టైం తీసుకుంటాం. కానీ మైక్‌ అలా కాదు.. 37.782 సెకన్లలో మొత్తం అరటిపండుని తినేసి గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే తినే క్రమంలో ఏమాత్రం చేతులను ఉపయోగించకపోవడం విశేషం. కెనడాలోని ఒన్‌టారియోకి చెందిన మైక్‌ జాక్‌..  ఓ ఫుడ్‌ కంటెంట్‌ క్రియేటర్‌. వెజిటేరియన్‌ ఫుడ్‌ తినమని ప్రోత్సహిస్తుంటాడు. ‘‘మైక్‌ జాక్‌ ఈట్స్‌ హీట్‌’’ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహించే మైక్‌ జాక్. .ఆహారానికి సంబంధించి పలు ప్రయోగాలను వీడియోలు రూపొందించి యూట్యూబ్‌లో పెడుతుంటాడు. ప్రస్తుతం ఆ ఛానెల్‌కి 28వేల చందాదారులు ఉన్నారు. అయితే మైక్‌కి గిన్నిస్‌ రికార్డు రావడం ఇదేమీ తొలిసారి కాదు.. గతంలో లీటర్‌ టమోటా సాస్‌ని 1నిమిషం 32 సెకన్ల తాగేసి ఔరా అనిపించాడు. అలా.. కేవలం వెజిటేరియన్‌ వంటకాలను అతి తక్కువ వ్యవధిలో తింటూ ఇప్పటి వరకు ఏకంగా 8 సార్లు గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కాడు. మరి జాక్‌ తిన్న అరటిపండు వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా గిన్నిస్‌వరల్డ్‌ రికార్డ్స్‌ షేర్‌ చేసింది. ఆ వీడియోను మీరూ వీక్షించండి.

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని